డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

 


యువతకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదారాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కి చెందిన డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఎంఆర్ఎల్‌).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెటలర్జీ/ మెటీరియల్ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెకానికల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.