కొత్తరకం వైరస్ పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

 


ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా విలవిలలాడిన ప్రపంచానికి మరో కొత్త వైరస్ వణుకుపుట్టిస్తోంది. బ్రిటన్ కేంద్రంగా కొత్త రకం కరోనా వైరస్ స్ట్రైయిన్ వ్యాధి దడపుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎపిడెమియోలాజికల్ నిఘా రెస్పాన్స్ కోసం ప్రామాణిక నిబంధనలు విడుదల చేసింది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలోఅన్ని రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై అంక్షలు విధించింది. అలాగే ఇప్పటి వరకు యూకే నుంచి ఇండియాకు వచ్చిన వారిని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడింది. అంతేకాదు, అంతర్జాతీయ విమనాశ్రయాల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారికి ఆర్టీపిసిఆర్ పరీక్షలు నిర్వహించాని ఆదేశించింది. నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు యుకే నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికులను గుర్తించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు జిల్లా నిఘా అధికారులను సంప్రదించాలని కేంద్రం సూచింది. అలాగే, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి 14 రోజుల ట్రావెల్ హిసట్రీ తీసుకోవాలని కేంద్ర రాష్ట్రాలను కోరింది. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా నెగిటివ్ వచ్చినా, కొన్ని రోజులు పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది. ఇక, పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్‌ ఎన్‌ఐవీ పుణెకు పంపాలని రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం కొత్తగా విడుదల చేసిన గైడ్ లైన్ లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.