భారత హాకీ జట్టు సరికొత్త రికార్డు.

 


భారత హాకీ జట్టు సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్​లో భారత్ కీలక స్థానాలను కైవసం చేసుకుంది. భారత పురుషుల జట్టు నాలుగో స్థానం, మహిళల హాకీ జట్టు తొమ్మిదో స్థానాన్ని దక్కించకుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఈ ఏడాది జరగాల్సిన అన్ని మ్యాచ్​లు రద్దయ్యాయి. బెల్జియం పురుషుల హాకీ జట్టు, నెదర్లాండ్​ మహిళల హాకీ జట్టు.. ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో నిలిచినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐఎఫ్​హెచ్​) ప్రకటించింది. చైనా చివరి స్థానంలో కొనసాగుతోంది. పురుషుల హాకీ జట్ల ర్యాంకింగ్స్​ ఇలా ఉన్నాయి…. 1. బెల్జియమ్​ (2496.88 పాయిట్లు) 2.ఆస్ట్రేలియా (2385.70 పాయిట్లు) 3.నెదర్లాండ్స్​ (2252.96 పాయిట్లు) 4.భారత్​ (2063.378 పాయిట్లు) 5.అర్జెంటీనా (1967.39 పాయిట్లు) 6.జర్మనీ (1944.34 పాయిట్లు) 7.ఇంగ్లాండ్​ (1743.77 పాయిట్లు) 8.న్యూజిలాండ్​ (1575.00 పాయిట్లు) మహిళల హాకీ జట్టు ర్యాంకింగ్స్​ 1.నెదర్లాండ్​ (2331.99 పాయిట్లు) 2.అర్జెంటీనా (2174.61 పాయిట్లు) 3.జర్మనీ (2054.28 పాయిట్లు) 4.ఆస్ట్రేలియా (2012.89 పాయిట్లు) 5.ఇంగ్లాండ్​ (1952.74 పాయిట్లు) 6.న్యూజిలాండ్​ (1818.98 పాయిట్లు) 7.స్పెయిన్​ (1802.13 పాయిట్లు) 8.ఐర్లాండ్​ (1583.09 పాయిట్లు) 9.భారత్​ (1543.00 పాయిట్లు) 10.చైనా (1521.00 పాయిట్లు)