ఆన్ లైన్లో టెట్ పరీక్ష.....?

 


ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత కోసం టీచర్ ఎలిజబిలిటీ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ పరీక్షను అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో రాస్తూ వస్తున్నారు. కానీ ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఎంసెట్, డీఎడ్ తదితర పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగానే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా తమ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టెట్ పాసయితే అది కేవలం ఏడేళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యే విధానం అమల్లో ఉంది. కానీ తాజాగా జాతీయ ఉపాధ్యాయ విద్యామండ‌లి(ఎన్‌సీటీఈ).. టెట్ పాసయితే జీవిత కాలం విలువ ఉంటుందని తీర్మానించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీటీఈ తీర్మానం నేప‌థ్యంలో రాష్ర్టంలోనూ జీవోకు స‌వ‌ర‌ణ చేయాల‌ని అధికారులు ప్రభుత్వానికి నివేదిం


చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు టెట్ నిర్వహించిన విషయం విదితమే.