"సోలో బ్రతుకే సోబెటర్" సినిమా రివ్యూ. డీసెంట్ హిట్ సొంతం చేసుకున్న సుప్రీం హీరో.

 


తారాగణం : సాయి ధరమ్ తేజ్, నభా నటేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సత్య దర్శకత్వం : సుబ్బు సంగీతం : థమన్ నిర్మాతలు : బి వి ఎన్ ఎస్ ప్రసాద్ రిలీజ్ డేట్ : డిసెంబర్ 25- 2020 మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సోబెటర్. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ సినిమాలో నభనటేష్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోతో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న ఒక స్టార్ హీరో సినిమా కావడంతో ‘సోలో బ్రతుకే సో బెటర్’కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేదాం… కథ : లైఫ్ లో పెళ్లి అనే టాపిక్ లేకుండా హ్యాపీగా సోలో లైఫ్ చాలా బెటర్ అంటూ జీవిస్తుంటాడు విరాట్ ( సాయిధరమ్ తేజ్ ). తన మావయ్య రావు రమేష్ నుంచి నేర్చుకున్న సిద్ధాంతాలను బలంగా నమ్ముతూ ఉంటాడువిరాట్. కానీ అనుకోని కారణాల వల్ల పెళ్లివరకు వెళ్తాడు. మరి అంత స్ట్రాంగ్ గా ఉన్న తేజ్ పెళ్లి వరకు ఎలా వెళ్లాల్సి వచ్చింది.? అసలు విరాట్ లైఫ్ లోకి అమృత ( నాబానటేష్) ఎలా వచ్చింది.? విరాట్ ఎంచుకున్న మార్గంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే… విశ్లేషణ: సాయి తేజ్ ప్యూర్ సింగిల్ రోల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే కామెడీని అయితే పర్ఫెక్ట్ గా పండించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ముందుకంటే బెటర్ అనిపించడు. నభా నటేష్ విషయానికి వస్తే తన పాత్రను చాలా బాగా చేసింది. నాచురల్ లుక్ తో మెరుగైన నటనను కూడా కనబర్చి కట్టుకుంది. సీనియర్ నటులు నరేష్ రావు రమేష్ మరియు రాజేంద్ర ప్రసాద్ లు నటనను కనబర్చారు. రావు రమేష్ తన కామెడీ టైమింగ్ తో మరోసారి ఆకట్టుకున్నారు. థమన్ ఈ సినిమాకు మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. మంచి పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అందించి కీలక పాత్ర పోషించాడు. కెమెరా పనితనం, ఎడిటింగ్, లిరిక్స్ విజువల్ అత్యున్నత స్థాయిలో కనిపిస్తాయి. దర్శకుడు మరి సినిమా పరంగా వస్తే తన తాను ఎంచుకున్న లైన్ ఫస్ట్ హాఫ్ ను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. క్లైమాక్స్ లో ఇంకొంచం ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ప్లస్ పాయింట్స్ : సాయి తేజ్ నటన ఫస్ట్ హాఫ్ కామెడీ ట్రాక్స్ మైనస్ పాయింట్స్ : కొన్ని సిల్లీ లాజిక్స్ క్లైమాక్స్