మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా.

 


శాస్ర్త సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తోన్న చైనా ఆ దిశలో మరో ముందడుగా వేసింది. తాజాగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని విజయంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని చైనా అంతరిక్ష సంస్థ వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించింది. ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించినట్లు చైనా మీడియా తెలిపింది. యోగాన్-33 పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్-4సీ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఈ ఉగ్రహం ద్వారా భూ వనరుల సర్వే, పంట దిగుబడి అంచనాలతో పాటు విపత్తుల నియంత్రణ వంటి లాభాలు చేకూరనున్నాయి. లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ మిషన్ సిరీస్‌లో ఇది 357వ మిషన్ అని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇక ఈ మిషన్ ద్వారానే మైక్రో, నానో సాంకేతిక ప్రయోగ ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు