ఫేస్ బుక్ కు ఫేక్ ఐడి దెబ్బ...

 


గ్రేటర్‌లో కార్పొరేటర్‌గా గెలిచిన కొంత మందికి ఆ ఆనందం నిలవడం లేదు. కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. ఇలా గెలిచామో లేదో.. అలా సమస్యలు వెంటాడుతున్నాయి. వారికున్న ఫేస్ వాల్యూను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు కొంత మంది కేటుగాళ్లు. అంబర్ పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఇందులో బాధితుడిగా మారారు. విజయ్ కుమార్ గౌడ్ పేరు, ఫొటో వాడుకుని ఫేస్ ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ చేశారు నకిలీగాళ్ళు. విజయ్ కుమార్ గౌడ్ అనుకుని అతని స్నేహితులు నిన్న సాయంత్రం నుంచి చాట్ చేస్తున్నారు. హాస్పిటల్ ఖర్చుల కోసం గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని కోరారు హ్యాకర్స్. విజయ్ కుమార్ డబ్బులు అడిగినట్లు కొంత మంది పంపించారు. విజయ్ కుమార్ గౌడ్‌కు ఆయన ఫ్రెండ్స్ ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఎవరినీ డబ్బులు అడగలేదు, ఆ FB అకౌంట్ తనది కాదని అంటున్నారు విజయ్ కుమార్ గౌడ్. ఎవరూ గూగుల్ పే ద్వారా డబ్బులు వేయవద్దని తన అనుచరులకు సూచించారు.