DRDO లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

 


నిరుద్యోగులకు డిఫెన్స్ రీసెర్స్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ లాబరేటరీ(DRDL)లో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ చివరి వారంలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొదట అభ్యర్థులను రెండేళ్ల కాంట్రాక్ట్ తో తీసుకోనున్నారు. అనంతరం మరో రెండేళ్ల పాటు పొడిగించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 28 సంవత్సరాలుగా నిర్ణయించారు. OBC అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిని సడలించారు. Mechanical engineering: ఈ విభాగంలో మొత్తం 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో BE/BTech ఫస్ట్ క్లాసులో పూర్తి చేసి, గేట్ లో మంచి స్కోర్ సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. Aeronautical or aerospace engineering: ఈ విభాగంలో మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ ను ఎయిరోనాటికల్ లేదా ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ లో పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. Official Notification అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డీఆర్డీఓ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసి నింపాల్సి ఉంటుంది. ఆ ఫారంను The Director, Defence Research & Development Laboratory (DRDL), Dr. APJ Abdul Kalam Missile Complex, Kanchanbagh PO, Hyderabad 500058 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఈ నెల 31లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు.