HIV అంటే ఏమిటి....?

 


ఈ భూ ప్రపంచం మీద మానవాళి ఇప్పటివరకు చూడని ప్రాణాంతక వ్యాధులలో ఎయిడ్స్ మహమ్మారి ఒకటి. దీనిని వైద్యపరంగా హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) లేదా అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఇది అంటు వ్యాధి, ఇది మానవ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది మరియు వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు, ఎయిడ్స్ వ్యాధితో మరణించిన వారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐవికి వ్యతిరేకంగా పోరాడటం కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ డే నిర్వహిస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) 1988లో తొలిసారిగా ఎయిడ్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. మానవ ఆరోగ్య సంబంధిత అంశాల కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించడంతో ఈ ఎయిడ్స్ డే మొదలైంది. ఈ సందర్భంగా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి... HIV అంటే ఏమిటి? హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) అనేది రోగనిరోధక శక్తిని దెబ్బతీసే వైరస్. చికిత్స చేయకపోతే, హెచ్ఐవి శరీరంలోని రోగనిరోధక కణాలైన సిడి 4 కణాలను నాశనం చేస్తుంది. ఈ కారణంగా మీకు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ అంటే.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) అనేది ద్వారా ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇది క్షీణించడం అంటే.. మన శరీరం అనారోగ్యంతో పోరాడే శక్తిని పూర్తిగా కోల్పోతుంది. ముఖ్యంగి సిడి 4 అనే రోగనిరోధక కణాలను ఈ ఎయిడ్స్ మహమ్మారి చంపేస్తుంది. దీని వల్ల వివిధ వ్యాధులు సంక్రమించి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎలా మారుతుందంటే.. తల్లి పాలు, లైంగిక కలయిక, మల ద్రవాలు, రక్తం, వీర్యం ద్వారా హెచ్ ఐవి వేగంగా వ్యాపిస్తుంది. ఇది జీవితకాలం పాటు ఉంటుంది. దీనికి మందు లేదు. కేవలం నివారణ మార్గం ఒక్కటే. అయితే సరైన చికిత్స మరియు నిర్వహణతో, ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV)తో జీవించగలడు. బయటపడే అవకాశం తక్కువ.. హెచ్ ఐవి సోకిన వెంటనే అది బయటపడే అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే అది ఎప్పుడైతే ఎయిడ్స్ గా బయటపడుతుందో.. అప్పుడే తెలిసే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని మనం నయం చేయలేం. ఎయిడ్స్ సోకిన వారి సగటు జీవితకాలం కేవలం మూడేళ్లే. ఒకవేళ ఎవరైనా ఎయిడ్స్ తో బాధపడుతుంటే వారికి కొంత ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా ఇతర అనారోగ్యానికి గురైనట్లయితే, ఆ వ్యక్తి బతికి ఉండే సమయం మరికొంత తగ్గుతుంది.