భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో t20.

 


టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ తరపున ఆరోన్ ఫించ్ జట్టులోకి రాగా.. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్ గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ చేయాలని చూస్తుండగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా.. దీనిలో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. అలాగే మరికొద్ది రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుండటంతో ఈ సిరీస్‌ను విజయంతో ఏ జట్టు ముగుస్తుందో వేచి చూడాలి.