ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్టణంలో TSLAWNEWS Telugu news channel మొదటి వార్షికోత్సవ వేడుకలు.
 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జర్నలిజం ఇన్ మాస్ కమ్యూనికేషన్ హెచ్.ఓ.డి  ప్రొఫెసర్ డీ.వీ.ఆర్ మూర్తి గారు మరియు  జర్నలిజం ఇన్ మాస్ కమ్యూనికేషన్ బి.ఓ.ఎస్   ప్రొఫెసర్ చెల్లా రామకృష్ణ గారు.


ఈ యొక్క కార్యక్రమంలో TSLAWNEWS Telugu News channel వ్యవస్థాపకులు కోవూరి  సత్యనారాయణ గౌడ్ గారు  మర్యాదపూర్వకంగా  ముఖ్య అతిథులుగా హాజరైన  జర్నలిజం ఇన్ మాస్ కమ్యూనికేషన్ హెచ్.ఓ.డి  ప్రొఫెసర్ డీ.వీ.ఆర్ మూర్తి గారిని  మరియు  జర్నలిజం ఇన్ మాస్ కమ్యూనికేషన్ బి.ఓ.ఎస్   ప్రొఫెసర్ చెల్లా రామకృష్ణ గారిని ఘనంగా శాలువాతో సన్మానించి  TSLAWNEWS Telugu News channel మొదటి వార్షికోత్సవ వేడుకలను జర్నలిజం ఇన్ మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులు , న్యాయవాదులు మరియు  ఫ్రొఫెసర్ల సమక్షంలో జరిపారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా హాజరైన  ప్రొఫెసర్లు TSLAWNEWS Telugu News channel యువతలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ , చట్టాలపైన పరిపూర్ణ అవగాహన కల్పిస్తూ  సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని  తెలియజేశారు.