యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది యూపీఎస్‌సీ. స్టాటిస్టికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోండి. మొత్తం ఖాళీలు- 36 స్టాటిస్టికల్ ఆఫీసర్ (ప్రింటింగ్ లేదా స్టాటిస్టిక్స్)- 35 సూపరింటెండెంట్ (ప్రింటింగ్)- 1 MIDHANI Jobs 2020: హైదరాబాద్‌లోని మిధానీలో జాబ్స్... రేపటి నుంచి ఇంటర్వ్యూలు దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 17 దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 18 విద్యార్హతలు- స్టాటిస్టికల్ ఆఫీసర్ (ప్రింటింగ్ లేదా స్టాటిస్టిక్స్) పోస్టుకు డిగ్రీ పాసైతే చాలు. సూపరింటెండెంట్ (ప్రింటింగ్) పోస్టుకు స్టాటిస్టిక్స్, ఆపరేషన్ రీసెర్చ్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్‌, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేయాలి. అందులో Superintendent (Printing), Statistical Officer (Planning/Statistics) పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి. Apply Now పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.