సింగరేణి లో 15 మెగావాట్ల సోలార్‌ పవర్ ప్లాంట్ ప్రారంభం


 సింగరేణి రామగుండం-3 ఏరియా పరిధిలో నిర్మాణంలో ఉన్న 50 మెగావాట్ల సింగరేణి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి మరో 15


మెగావాట్ల సోలార్‌ విభాగాన్ని బుధవారం టీఎస్‌ ట్రాన్స్‌కోకు అనుసంధానం చేసినట్లు సంస్థ సీఎండీ ఎన్‌. శ్రీధర్‌ తెలిపారు. ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణరావు ప్రారంభించారు. ఇప్పటికే 50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ నుంచి గత నవంబర్‌ 27న 15 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేశామని, దీంతో రామగుండం-3లో సోలార్‌ ప్లాంట్‌ నుంచి మొత్తం 30 మెగావాట్ల సోలార్‌ ఉత్పత్తి ట్రాన్స్‌కోకు అనుసంధానం అయిందన్నారు. మొదటి దశలో 129 మెగావాట్ల సామర్థ్యంలో ఇప్పటికే 85 మెగావాట్ల సింగరేణి సోలార్‌ పవర్‌ట్రాన్స్‌కోకు అనుసంధానమైందన్నారు. ఈ ప్లాంట్‌లో ఇంకా మిగిలిన 20 మెగావాట్ల విభాగాన్ని వచ్చే నెల చివరికల్లా అనుసంధానం చేస్తాన్నారు. 15 మెగావాట్ల సోలార్‌ వి ద్యుత్‌ అనుసంధానంపై ఆయన సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.ఆర్‌జీ-3 ఏరియా జీఎం సూర్యనారాయణ, జీఎం సోలార్‌ డీవీఎస్‌ఎస్‌ఎన్‌ రాజు, బీహెచ్‌ఈఎల్‌ ఏజీఎం సుభాస్‌ భన్వాలికర్‌ పాల్గొన్నారు.