జనవరి 16 న ఢిల్లీ లోని 81 ప్రదేశాలలో 'కరోనా' టీకాలు

 


జనవరి 16 న ఢిల్లీ లోని 81 ప్రదేశాలలో 'కరోనా' టీకాలు వేయనున్నారు అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ ప్రదేశాలలో రోజుకు సుమారు 100 మందికి టీకాలు వేస్తారు. వారానికి నాలుగు రోజులు సోమవారం, మంగళవారం, గురువారం మరియు శనివారం టీకాలు వేస్తారు. దేశరాజధానిలో 81 కేంద్రాలతో 'కరోనా' వాక్సినేషన్ ప్రారంభిస్తున్నం అని చెప్పిన ఆయన కొద్ది రోజుల్లో వీటిని 175 కి, ఆపై 1000 కేంద్రాలకు పెంచుతాం అని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి 2,74,000 మోతాదుల వ్యాక్సిన్ వచ్చింది. ప్రతి వ్యక్తికి రెండు విడతలుగా రెండు మోతాదుల వాక్సిన్ ఇవ్వబడతాయి. కేంద్రం 10 శాతం అదనపు వ్యాక్సిన్‌ను అందిస్తుంది. సరైన ఉష్ణోగ్రత లో స్టోర్ చేయలేకపోవడం, రవాణా తదితర కారణాల వల్ల జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి 1,70, 000 మంది ఆరోగ్య కార్యకర్తలకు తొలివిడత కోసం 2,74,000 మోతాదుల వాక్సిన్ సరిపోతుంది అని కేజ్రీవాల్ తెలిపారు.