దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

 


దేశ వ్యాప్తంగా ఈ నెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలు కానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు వాక్సిన్ చేరుకోనుంది. తెలంగాణకు మొత్తం 6.5 లక్షల డోసులు రానున్నాయి. 16 నుంచి దేశ వ్యాప్తంగా వాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న నేపధ్యంలో తెలంగాణలో 1213 సెంటర్లలో వాక్సినేషన్ జరగనుంది. మొదట 3 లక్షల హెల్త్ కేర్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వనున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిన్నమంత్రులు, కలెక్టర్ల సమావేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి సమీక్షించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు.