. 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళిక : బైడెన్కరోనా వైరస్ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం అమెరికా ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రణాళిక రూపొందించారు. 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రణాళికను బైడెన్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం సహా రాష్ర్టాలు, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అమెరికన్ రెస్క్యూ ప్లాన్ పేరిట జో బైడెన్ ప్రతిపాదన చేశారు. పాలన చేపట్టిన వంద రోజుల్లోగా వంద మిలియన్ల టీకాలు వేయడమే లక్ష్యంగా ఆయన ప్రణాళిక తయారు చేశారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం మరో దఫా సాయం అందించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానంపై అదే రోజు సెనేట్ విచారణ జరగనుంది. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే.