టాలీవుడ్ హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా 'మహా సముద్రం' ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో శర్వానంద్, సిద్దార్థ్ ఇద్దరూ ఓ బోట్ పై కూర్చొని తీక్షణంగా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.