హెచ్‌1 బీ వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు.

 


అమెరికా కొత్త అధ్యక్షుడిగా బెడైన్‌ నియామకం ఖరారైపోయింది. మరికొన్ని రోజుల్లో అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ తరుణంలోనే పలు కీలక నిర్ణయాల దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే హెచ్‌1 బీ వీసా ఎంపిక ప్రక్రియలో మార్పులు తీసుకురానున్నారు. తాజాగా ఈ విషయమై యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా గురువారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న లాటరీ పద్ధతికి స్వస్తి చెప్పి.. శాలరీ, స్కిల్స్‌ ఆధారంగా హెచ్‌1బీ వీసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అమెరికా ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు కేవలం నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులే ఈ వీసాల ద్వారా ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తుది నిబంధనను ఫెడరల్‌ రిజిస్టర్‌లో పబ్లిష్‌ చేయనున్నారు. ఆ తర్వాత 60 రోజులకు ఇది అమల్లోకి వస్తుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 1 నుంచి మరోసారి హెచ్‌-1బీ వీసా ఫైలింగ్ సీజ‌న్ ప్రారంభ‌మ‌వుతుంది.