హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం మరో నిర్ణయం

 


అమెరికాలో విదేశీ ఉద్యోగులు పనిచేయడానికి ఉద్దేశించిన అమెరికాలో విదేశీ ఉద్యోగులు పనిచేయడానికి ఉద్దేశించిన హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. లాటరీ విధానం బదులు అధిక వేతనాలు, మంచి నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత లాటరీ విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగం, నైపుణ్యాలకు ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ ప్రచురితమైంది. ఈ కొత్త నిబంధన 60 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. లాటరీ విధానం కారణంగా కంపెనీలకు ప్రయోజనం కలగడం లేదని, నిపుణులు ఎవరో వాటికి తెలియడం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ ఉద్యోగులతో తక్కువ వేతనాలతో పనిచేయించుకోకుండా వారికి ఎక్కువ జీతాలు చెల్లించేలా చూడడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తదుపరి హెచ్‌-1బీ వీసా ఫైలింగ్‌ సీజన్‌ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. అమెరికాలోని అత్యధిక టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాలపై ఇండియా, చైనాలకు చెందిన ఉద్యోగులనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నాయి.
మరో రెండు వారాల్లో ట్రంప్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ నోటిఫికేషన్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పులు భారతీయ కంపెనీలపై చూపే ప్రభావాన్ని ఇప్పుడే అంచనావేయలేమని నిపుణులు అంటున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం జో బైడెన్‌ హెచ్‌-1బీ వీసా నిబంధనలపై సమీక్షించే అవకాశాలున్నాయి. హెచ్‌-1బీ వీసాలతోపాటు ఇతర వర్క్‌ వీసాలు, గ్రీన్‌ కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగిస్తూ గతవారం ట్రంప్‌ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తీసుకొంది. హెచ్‌-1బీ వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. లాటరీ విధానం బదులు అధిక వేతనాలు, మంచి నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత లాటరీ విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగం, నైపుణ్యాలకు ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ ప్రచురితమైంది. ఈ కొత్త నిబంధన 60 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. లాటరీ విధానం కారణంగా కంపెనీలకు ప్రయోజనం కలగడం లేదని, నిపుణులు ఎవరో వాటికి తెలియడం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ ఉద్యోగులతో తక్కువ వేతనాలతో పనిచేయించుకోకుండా వారికి ఎక్కువ జీతాలు చెల్లించేలా చూడడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తదుపరి హెచ్‌-1బీ వీసా ఫైలింగ్‌ సీజన్‌ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. అమెరికాలోని అత్యధిక టెక్నాలజీ కంపెనీలు హెచ్‌-1బీ వీసాలపై ఇండియా, చైనాలకు చెందిన ఉద్యోగులనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నాయి. మరో రెండు వారాల్లో ట్రంప్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ నోటిఫికేషన్‌ను తీసుకొచ్చింది. ఈ మార్పులు భారతీయ కంపెనీలపై చూపే ప్రభావాన్ని ఇప్పుడే అంచనావేయలేమని నిపుణులు అంటున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన అనంతరం జో బైడెన్‌ హెచ్‌-1బీ వీసా నిబంధనలపై సమీక్షించే అవకాశాలున్నాయి. హెచ్‌-1బీ వీసాలతోపాటు ఇతర వర్క్‌ వీసాలు, గ్రీన్‌ కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని మార్చి 31వరకు పొడిగిస్తూ గతవారం ట్రంప్‌ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.