హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఇవాళ్టి నుంచి నెలకు 20 వేల లీటర్ల దాకా తాగునీటిని ఉచితం

 


GHMC, హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఇవాళ్టి నుంచి నెలకు 20 వేల లీటర్ల దాకా తాగునీటిని ఉచితంగా పొందుతారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇవాళ మంత్రి కేటీఆర్... ఈ ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా హైదరాబాదీ ప్రజలు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశం రూపంలో ఇచ్చింది. ఈ ఉచిత మంచి నీటి సరఫరా పథకం వల్ల నగరంలో నివసిస్తున్న సుమారు 97 శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. వారంతా ఇకపై పరిమితి లోపు నీటిని వాడుకుంటూ... నీటి బిల్లులు చెల్లించే అవసరం లేకుండా చేసుకోవచ్చు.


ఉచిత నీటి పథకాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నా... డిసెంబర్ నీటి బిల్లు కూడా ఉచిత పథకం కిందకే వస్తుంది. అందువల్ల డిసెంబర్ 2020లో 20 వేల లీటర్ల లోపు నీటిని వాడుకున్నవారు ఆ బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. 20 వేల లీటర్ల పైన నీటిని వాడితే.. అదనంగా వాడిన నీటికి బిల్లు చెల్లించాలి. ఈ ఫ్రీ పొందాలంటే... నల్లాలకు నీటి మీటర్లు ఉండాలి. సిటీలో చాలా మందికి అలాంటివి లేవు. ఇప్పుడైనా ఏర్పాటు చేసుకుంటే ఈ బిల్లుల భారం తప్పుతుంది. ఈ స్కీం ఢిల్లీలో అమల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలోని GHMC పరిధిలో అమల్లోకి వస్తోంది.


ఈ పథకం కింద కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి తెలుసుకుందాం.


డొమెస్టిక్ స్లమ్ ఏరియాల్లో వారు తమ ఇళ్లలో నెలకు 20 వేల లీటర్ల లోపు వాడితే బిల్లు జీరో వస్తుంది. ఇందుకోసం వీరు నల్లా కనెక్షన్లకు వాటర్ మీటర్లను సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.


ఇళ్లలో వారు వాటర్ మీటర్లు సెట్ చేసుకోవాలి. ఏ ఏజెన్సీల నుంచి మీటర్ సెట్ చేసుకోవాలో జలమండలి వెబ్‌సైట్‌లో వివరాలు ఉన్నాయి. 20వేల లీటర్ల లోపు బిల్లు రాదు. పరమితి దాటితే అదనపు వాడకానికి బిల్లు వస్తుంది.


వీరు కూడా మీటర్లు సెట్ చేసుకోవాలి. ఒక్కో ఫ్లాటుకీ 20వేల లీటర్లు ప్రీ. అంతకుమించితే బిల్లు వస్తుంది. వీరు కూడా జలమండలి బోర్డు చెప్పిన ఏజెన్సీల ద్వారానే వాటర్ మీటర్లను బిగించుకోవాలి.