రాజస్థాన్లోని ఓ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. సూరత్గఢ్లోని ఎయిర్బెస్లో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సమస్య కారణంగా కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎలాంటి ఆస్తినష్టం కూడా జరగనట్లు తెలుస్తోంది. విమానం ఒక్కసారిగా కూలడంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఎయిర్బెస్కు చేరుకున్నారు. సాంకేతిక లోపం వల్లే విమానం కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.