తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 186 కరోనా కేసులు





  తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 186 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 367 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,306 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,90,354 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,598 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,354 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 920 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి.