జనవరి 29 న మాస్టర్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల




 తమిళ సూపర్ స్టార్ ఇళయ థలపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'మాస్టర్'. ఈ సినిమాకు ఖైదీ సినిమాతో సూపర్ పాపులరైనా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఖైదీ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. దీనికి తోడు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించడంతో అంచనాలు మరో రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ మాస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింతపెంచుతూ పోయింది. మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. మాస్టర్ పోయిన సమ్మర్‌లోనే విడుదకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా వాయిదా పడుతూ, వాయిదా పడుతూ చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ లో కొన్ని సడలింపులు ఇచ్చారు. దీంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. అయితే యాబైశాతం మాత్రమే టిక్కెట్స్‌ను అందుబాటులో ఉంచాలి. ఇన్ని కండిషన్స్ మధ్య భారీ అంచనాల నడుమ విడుదలైన విజయ్ మాస్టర్ అందర్నీ అలరించలేకపోయింది. మాస్టర్ కేవలం విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రమే అంటూ టాక్ బయటకు వచ్చింది.