కేజీఎఫ్2 సినిమాకి ఊహించని షాక్.

 


కేజీఎఫ్2 చిత్ర టీజర్లో యశ్ (రాఖీ భాయ్) సిగరెట్ తాగే సన్నివేశం హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సన్నివేశం పట్ల కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఆరోగ్య శాఖ చిత్ర యూనిట్ కి నోటీసులు అందజేసింది. సిగరెట్ తాగే సన్నివేశాలను తొలగించాలని సూచించింది.  టోబాకో 2003 చట్టం లోని సెక్షన్ 5 నిబంధనల ప్రకారం పొగ త్రాగే సన్నివేశాలు ఉండకూడదు అని, వాటిని తొలగించకపోతే ఈ చట్టాన్ని అతిక్రమించినట్లే అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి సన్నివేశాల కారణం గా యువత చెడుదారి పట్టే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది. అందుకే ఈ చిత్రం లో పొగ త్రాగే సన్నివేశాలను తొలగించాలని, పొగ త్రాగడం కారణం గాక్యాన్సర్ మరియు ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయి అని, సినిమాల్లో హీరోలు పొగ త్రాగడం చూసి, యువత కూడా వారి అడుగుల్లో నదిచి త్రాగుతారు అని, దీంతో దేశం లోని యువత అనారోగ్యం పాలవుతుంది అని తెలిపింది. అయితే సినిమా లోని సన్నివేశాలను తొలగించకపోతే ఆ సినిమా పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ సినిమా ఈ సమ్మర్ కి విడుదల కానున్న సంగతి తెలిసిందే.