. ప్రభుత్వం కనీసం 30 శాతం ఫిట్​మెంట్​​ అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకునే యోచన

 


తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫిట్ మెంట్ అంశం ఇంకా ఎటూ తేలకపోవడంతో ఆయా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కనీసం 30 శాతం ఫిట్​మెంట్​​ అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలతో ఈ విషయం చర్చించకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫిట్​మెంట్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి పండుగ అనంతరం పీఆర్సీపై ప్రభుత్వం జీవో జారీ చేయనుందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ముందుగా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తే ఈ విషయం ఎటూ తేలదని ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్​మెంట్​ ప్రకటించిన అనతరం బెనిఫిట్స్ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం అవుతారని సమాచారం. ​ఫిట్​మెంట్​ను ఎప్పటి నుంచి అమలు చేస్తారని అంశంపై ఇంకా సర్కార్ తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.  ఇదిలా ఉంటే.. ఆదాయపన్ను శాఖకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో ఐటీ శాఖ సీజ్‌ చేసిన డబ్బు తమ సంస్థకు చెందినదని మెక్‌టెక్‌ సంస్థ అన్ని ఆధారాలు చూపిస్తున్న నేపథ్యంలో ఆ డబ్బు ఆదాయపన్ను శాఖ ఆధీనంలో ఉంచుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. సీజ్‌ చేసిన డబ్బు ఎవరిదన్న విషయంలో స్పష్టత రావడంతో.. ఆదాయపన్ను శాఖ ఆధీనంలో ఉన్న రూ.5 కోట్లను 2019 ఆగస్టు 28 నుంచి 12 శాతం వడ్డీతో కలిపి మెక్‌టెక్‌ సంస్థకు 4 వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.దీంతోపాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. హైదరాబాద్‌లోని వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేసిన రూ.5 కోట్లను.. తామే సీజ్‌ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తప్పుడు పంచనామా రూపొందించి ప్రకటించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.