నేషనల్ ఇమ్యునైజేషన్ డే (పల్స్ పోలియో)ను జనవరి 31న

 


 కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కారణంగా వాయిదా వేసిన నేషనల్ ఇమ్యునైజేషన్ డే (పల్స్ పోలియో)ను జనవరి 31న నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నిజానికి వచ్చే ఆదివారమే ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ నెల 16న (శనివారం) దేశవ్యాప్తంగా తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత పోలియో వ్యాక్సినేషన్ లేదా పోలియా రవివార్ కార్యక్రమాన్ని జనవరి 31కి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య శాక ఒక ప్రకటనలో తెలిపింది.