ఆర్.ఆర్.ఆర్‌ సినిమా అభిమానులకు సర్‌ప్రైజ్‌ .‌

 


దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్లూరి సీతరామ రాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీంలు ఇద్దరు ఒకవేళ కలిస్తే, వారి మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుందన్న కల్పిత కథ ఆధారంగా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లు నెట్టింట్లో సంచనలం సృష్టించాయి. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 26న ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి. భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తోన్న ఈ సినిమాలో ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ వంటి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ నటిస్తున్నారు.