ప్రొడక్షన్ హౌస్ లలో పెట్టుబడులు పెట్టనున్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు కమిట్ అయ్యి చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్. క్రిష్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాతో పాటు ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వరుసగా హరీష్ శంకర్ తో, సురేందర్ రెడ్డితో సినిమాలు చేయబోతున్నారు. అలాగే బండ్ల గణేష్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు పవన్. ఇక క్రిష్ పవన్ సినిమా పిరియాడికల్ స్టోరీతో ఉండవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా మొగలుల కాలంనాటి స్టోరీతో తెరకెక్కనుంది. కోహినూరు వజ్రం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ త్వరలో కొన్ని ప్రొడక్షన్ హౌస్ లలో పెట్టుబడులు పెట్టనున్నారని ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ అందుకోనున్నారట. అయితే తనకు వచ్చే పారితోషకంలో దాదాపు 40 శాతాన్ని వివిధ ప్రొడక్షన్ హౌసెస్ లో పెట్టుబడిగా పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.