తెలంగాణలో కోళ్ల వ్యర్ధాలతో తొలి బయోగ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం.

 


పౌల్ట్రీఫారమ్ లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పని చేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్టు రాష్ట్రంగా ఏర్పాటు అయింది. హైదరాబాద్ శివారులోని ఉడిత్యాల్ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్ ఈఎంఎక్స్ ప్రాజెక్టు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ బయోగ్యాస్ ప్రాజెక్టు గురువారం ప్రారంభమైంది. అయితే రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈడీ ఆర్ఎస్ఎస్ రావు ప్రారంభించారు. 4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్ పక్కనే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కాగా, కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోలికా ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్లాంట్ లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్ ను అత్తాపూర్ లోని ఐఓఎల్ ఔట్ లెట్ కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సోలికా ప్రమోటర్ హిమదీప్ తెలిపారు.