ఆయిల్ ట్యాంకర్ లో అక్రమ దందా.

 


అక్రమ దందాపై పోలీసులు నిఘా పెడుతున్నప్పటకీ.. అక్రమార్కులు యధేచ్చగా అడ్డదారులు వెతుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయిల్ ట్యాంక్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద ఎస్.కోట పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో అరకు నుండి పాట్నా వెళ్తున్న ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ WB 23A 5169 నెంబర్ గల ట్యాంకర్ లో అక్రమంగా తరలిస్తున్న 900 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ముపై ఆరు లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న లారీ డ్రైవర్ మనోజ్ కుమార్‌తో పాటు క్లీనర్ సురేందర్ అభి దాస్ రవిను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.