పాకిస్థాన్ దేశం కోసం రాజస్థాన్ రాష్ట్రంలో గూఢచర్యం

 


పాకిస్థాన్ దేశం కోసం రాజస్థాన్ రాష్ట్రంలో గూఢచర్యం సాగిస్తున్న ఓ వ్యక్తిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ నగరానికి చెందిన సత్యనారాయణ్ పలివాల్ అనే 42 ఏళ్ల వ్యక్తి పాక్ కోసం గూఢచర్యం చేస్తుండగా తాము అరెస్టు చేశామని జైపూర్ సీఐడీ పోలీసులు చెప్పారు. భారత సైన్యం, పోలీసుల సమాచారాన్ని గూఢచారి సత్యనారాయణ్ పాకిస్థాన్ దేశానికి చేరవేశాడని జైపూర్ సీఐడీ అధికారులు చెప్పారు. భారత మిలటరీ సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ ఏజెంటుకు పంపించానని నిందితుడు సత్యనారాయణ్ అంగీకరించాడు. పాక్ ఐఎస్ఐ ఏజెంటుతో సత్యనారాయణ్ కు సంబంధాలున్నాయని, ఆయన దేశ సైనికులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ ఏజెంటుకు అందించాడని సీఐడీ పోలీసుల దర్యాప్తులో తేలింది.