చిరంజీవి తాజా చిత్రం ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సురేఖ కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ 'లూసిఫర్' ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌ను తయారు చేశారు