చరిత్ర తిరగరాసిన యువ క్రికెట్ ఆటగాళ్ళు

 గబ్బా టెస్ట్ లో టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఆఖరి టెస్ట్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. నాలుగో టెస్ట్ లో మూడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. దీంతో 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. యంగ్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ అదిరిపోయే బ్యాటింగ్ తో టీమిండియా అద్భుత విజయాన్ని అందించాడు. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచి సవాల్‌ విసిరిన ఆసీస్‌కు అదే రీతిలో భారత బ్యాట్స్‌మెన్స్‌ సమాధానం చెప్పారు. 32 ఏళ్ల తర్వాత బ్రిస్బేన్‌లో ఆసీస్‌ జైత్రయాత్రను అడ్డుకొని సింహంలా గర్జీంచిచారు. సిరీస్ మెుత్తంలో భారత్ చివరి మ్యాచ్ గెలుపు ఓ అద్భుతమని చెప్పాలి. నలుగురు యువ ఆటగాళ్ళ అద్భుత ఆటతీరు టీమిండియా సిరీస్ గెలిచేలా చేసింది.    అసలు ఇతనికి ఏ మ్యాచ్‌లోనైనా అవకాశం దొరుకుతుందా!.. ఆసీస్ టూర్‌కు అతను కేవలం టూరీస్ట్‌లా మాత్రమే వెళ్ళాడన్న విమర్శల వేళ ఆ యువ ఆటగాడు బెబ్బులి పులిలా విజృభించాడు. టెస్ట్ సిరీస్‌లో బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా స్థానం దక్కించుకున్న అతడు.. చివరకు జట్టులోకి అడుగుపెట్టి గబ్బాలో గర్జీంచాడు. చివరకు 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన పంత్‌ ఇక రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాచ్‌ విజేతగా నిలిచాడు. 1000 పరుగుల మైలురాయి అందుకుని.. ఇప్పటివరకు వికెట్ కీపర్‌ ధోనీపై ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.    ఆడుతుంది మెుదటి టెస్ట్ సిరీస్ .. అది ఆసీస్ లాంటి ఆగ్రశ్రేణి జట్టుపైనా అయినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా అద్భుతంగా రాణించారు శుభ్‌మన్ గిల్‌. చివరి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అతడు వేసిన పునాది జట్టు విజయానికి దోహాదపడింది.    పుజారాతో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం విజయం సాధించగలం అనే ధీమాను ఇచ్చింది. ఆసీస్‌ పేసర్ల నుంచి దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొంటు మూడున్నర గంటలు క్రీజులో నిలిచాడు. చివరికి 146 బంతుల్లో 8 బౌండరీలు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు..    పోట్టీ ఫార్మట్ స్పీన్నరైనా వాషింగ్టన్‌ సుందర్‌ టెస్ట్‌లో కూడా ఆడాగలను అని నిరూపించాడు. జడేజా స్థానంలో వచ్చి మంచి ప్రదర్శన కనబరిచాడు. బ్యాటు ఇటు బంతితో రాణించి శభాష్ అనిపించాడు. పిచ్‌ను అధ్యయనం చేసి బౌలింగ్‌లోనే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ ఆదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసి ఆసీస్‌కు ఎక్కువ ఆధిక్యం దక్కకుండా చూశాడు. అలాగే టెస్టులో 4 వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.    ఇక హైదరాబాదీ సేసర్ మహ్మద్‌ సిరాజ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆడుతుంది మెుదటి టెస్ట్ సిరీసైనా సూపర్ బౌలింగ్‌తో జట్టులో సీనియర్ బౌలర్లు లేరనే కొరతను తీర్చాడు. ఆరంభ బౌలర్‌గా టీమిండియా బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. గబ్బాలో ఆసీస్‌ను రెండుసార్లు ఆలౌట్‌ చేయడం అతనిదే కీలక పాత్ర. మెుదటి ఇన్నింగ్ప్‌లో 1/77తో ఆరంభంలోనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఇన్ని్ంగ్స్‌లో రెచ్చిపోయి 5/73తో రాణించాడు. ఆసీస్ కీలక ఆటగాళ్ళైనా స్టీవ్‌స్మిత్‌, లబుషేన్‌ను పెవిలియన్‌ పంపి.. మెుత్తంగా ఐదు వికెట్ల తీసి మురిసిపోయాడు. ఈ సిరీస్‌ గెలుపును తన తండ్రికి అకింతం చేశాడు.