జమ్మికుంట మండలం వావిలాలలో ఇద్దరు విద్యార్థినిల అదృశ్యం కలకలం

 కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంట మండలం వావిలాలలో ఇద్దరు విద్యార్థినిల అదృశ్యం కలకలం రేపుతోంది. స్కూల్‎కి వెళ్లి వస్తామని ఇంట్లో నుంచి వెళ్లిన విద్యార్థినిలు కృష్ణ శ్రీ, సామ వైష్ణవి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురైనారు. దీంతో వారు వెంటనే జమ్మికుంట పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థినిల కోసము గాలింపు చర్యలు చేపట్టారు.