తెలంగాణలోని వైద్య సిబ్బందికి వారం, పది రోజుల్లోపే కరోనా టీకా.

 


తెలంగాణలోని వైద్య సిబ్బందికి వారం, పది రోజుల్లోపే కరోనా టీకా వేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం టీకా విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దీన్నిబట్టి ఈ నెల రెండో వారంలోపే రాష్ట్రంలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ముందుగా 2 లక్షల 67 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. ఆ వివరాలన్నీ కొవిడ్‌ యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 28.79 శాతం మంది వైద్యసిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది సాధారణ ప్రజలకు టీకాలు ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీకా పొందే ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది అధికంగా ఉన్న 10 జిల్లాల వివరాలు చూద్దాం.

హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య సిబ్బంది 16, 518…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 60,288
రంగారెడ్డి ప్రభుత్వ వైద్య సిబ్బంది 5,899…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 19,312
నల్గొండ 17, 827…. 2,022
ఖమ్మం 6,866…. 7514
నిజామాబాద్‌ 5,821…. 3170
వరంగల్‌ 5,766…. 5,688
సిద్ధిపేట 5,475…. 8,196
సంగారెడ్డి 5,266…. 3,289
కరీంనగర్‌ 3,671…. 7,514
మేడ్చల్‌ ప్రభుత్వ వైద్య సిబ్బంది 2000…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 8,050
 టీకా వేసే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం టీకా విషయంలో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని, దీన్నిబట్టి ఈ నెల రెండో వారంలోపే రాష్ట్రంలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ముందుగా 2 లక్షల 67 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. ఆ వివరాలన్నీ కొవిడ్‌ యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 28.79 శాతం మంది వైద్యసిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది సాధారణ ప్రజలకు టీకాలు ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీకా పొందే ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బంది అధికంగా ఉన్న 10 జిల్లాల వివరాలు చూద్దాం. హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్య సిబ్బంది 16, 518…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 60,288 రంగారెడ్డి ప్రభుత్వ వైద్య సిబ్బంది 5,899…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 19,312 నల్గొండ 17, 827…. 2,022 ఖమ్మం 6,866…. 7514 నిజామాబాద్‌ 5,821…. 3170 వరంగల్‌ 5,766…. 5,688 సిద్ధిపేట 5,475…. 8,196 సంగారెడ్డి 5,266…. 3,289 కరీంనగర్‌ 3,671…. 7,514 మేడ్చల్‌ ప్రభుత్వ వైద్య సిబ్బంది 2000…. ప్రైవేట్‌ వైద్య సిబ్బంది 8,050