విద్యాసంస్థల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

 హైదరాబాద్ : రాష్ర్టంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏ తరగతి నుంచి తరగతులు నిర్వహించాలనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. తరగతులు ఏ విధంగా నిర్వహించాలి? ఇతర రాష్ర్టాల్లో అనుసరిస్తున్న విధానంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో విద్యాసంస్థల రీఓపెన్‌పై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పరీక్షల విధానంలో మార్పులపై కూడా చర్చించనున్నారు. సర్కారు అనుమతిస్తే ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే తరగతుల ప్రారంభంపై ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు పంపింది.