హింసాత్మకంగా మారిన నిరసనలు - ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

 


రిపబ్లిక్‌ డే సందర్భంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో నిరసనను ముగిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (భాను) అధ్యక్షుడు ఠాకూర్ భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ శివారులోని చిల్లా సరిహద్దు వద్ద కొందరు రైతులు తమ గుడారాలను తొలగిస్తున్నారు. రెండు నెలలపాటు ప్రశాంతంగా కొనసాగిన నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారడంపై కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మద్దతు ధర చట్టబద్ధత కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మరి కొందరు తెలిపారు.