ఐపీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలుఐపీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ibps.in వెబ్ సైట్ లో అధికారులు ఈ రోజు విడుదల చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 1, డిసెంబర్ 31 తేదీల్లో పరీక్షకు హాజరైన వారు ఫలితాలను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరైన వారు జనవరి 18లోగా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.


-అభ్యర్థులు మొదటగా ibps.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

-అనంతరం మీకు పైన CRP RRB IX రిజల్ట్ లింక్ స్క్రోల్ అవుతూ కనిపిస్తోంది.

-ఆ లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ తదితర వివరాలను ఎంటర్ చేయాలి. -అనంతరం మీకు రిజల్ట్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం మీరు ఆ రిజల్ట్ కాపీని ప్రింట్ తీసుకుని దాచుకోవడం మంచిది.

-ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా త్వరలోనే మెయిన్స్ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు.