‘అల్లుడు అదుర్స్’ సినిమా ట్రైలర్ విడుదల.

 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. నభా నటేష్, అనూ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘లవ్ అంటే నాన్‌సెన్స్ అని ఫీలయ్యేవాడిని.. మీ డాటర్ ఇంట్రడక్షన్‌తో నా క్యారెక్టర్ మొత్తం టర్న్ అయిపోయింది’ అని హీరో చెప్పే డైలాగులతో ట్రైలర్ మొదలై ఆద్యంతం కామెడీ సన్నివేశాలతో అలరిస్తుంది. నభా నటేష్, అనూ ఇమ్మాన్యూయేల్ అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. ట్రైలర్ చూస్తుంటే.. బెల్లంకొండ ఖచ్చితంగా మరో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడని చెప్పాలి. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూసూద్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేట్ ఎందుకు మీరు కూడా ట్రైలర్‌పై ఓ లుక్కేయంకే

డి