మంచిర్యాల జిల్లాలో దొంగనోట్ల చలామణి కలకలం రేపుతుంది.

 


మంచిర్యాల జిల్లాలో దొంగనోట్లను చలామణి కలకలం రేపింది. ఫేక్ నోట్స్ సర్కులేట్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన రాజేషం, మల్లేష్ అనే వ్యక్తుల వద్ద 60 వేల దొంగనోట్లను పోలీసులు సీజ్ చేశారు. వారు లక్షా 50 వేలకు పైగా దొంగనోట్లు ముద్రించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పెద్ద నోట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. రైతులు, చిరు వ్యాపారులు 500, 200 నోట్లను జాగ్రత్తగా గమనించి తీసుకోవాలని కోరారు. దొంగ నోటుగా అనుమానం వస్తే పోలీసులకు సమాచారమ ఇవ్వాలని పేర్కొన్నారు. బ్యాంకర్స్ సైతం దొంగ నోట్లు లభిస్తే నకిలీ అని రాసి పక్కన పడేస్తున్నారే తప్ప పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. దొంగ నోట్లు వస్తే పోలీసులకు తప్పకుండా సమాచారం ఇవ్వాలని ఆయన బ్యాంకు ఉద్యోగులను కూడా కోరారు. తాజాగా కేసులో దొంగనోట్ల ముద్రణ వెనుక ఎవ్వరున్నా వదిలేది ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.