లైట్ హౌస్ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం.

 


2021 మొదటి రోజున భారతదేశ పట్టణాభివృద్ధిని ఉద్దేశించిన నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ప్రతి ఒక్కిరికి సొంతి కళ నెరవేరుస్తూ.. లైట్ హౌస్ ప్రాజెక్టులకు పునాది వేశారు ప్రధాని. PMAY (అర్బన్)ASHA- ఇండియా అవార్డులను పంపిణీ చేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ (జిహెచ్‌టిసి) -ఇండియా కింద లైట్ హౌస్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పునాది రాయిని వేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలతో నిర్మిస్తున్న ప్రధాని తెలిపారు. కొత్త టెక్నాలజీ ఆధారంగా నిర్మాణాల్లో విపత్తులను ఎదుర్కొనేందుకు వీలుంటుందన్నారు.