స్వదేశంలో తయారు చేసిన తొలి డ్రైవరులెస్ రైలు ముంబైకు...

  

స్వదేశంలో తయారు చేసిన తొలి డ్రైవరులెస్ రైలు జనవరి 27వతేదీన ముంబైకు చేరుకుంటుందని మహారాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ
మంత్రి ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. ముంబై మెట్రోలో మొదటి సారి డ్రైవరు లేని రైలును బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్సు లిమిటెడ్ తయారు చేసింది. ఆటోమేటిక్ రైళ్లలో మొదటి డ్రైవరు లెస్ మెట్రోరైలును ముంబైలోని చార్కోప్ మెట్రో కారిడారుకు తరలించనున్నారు. డ్రైవరు లేని మెట్రోరైలు ముంబైలోని రెండు మార్గాల్లో మే నెల నుంచి ప్రారంభించనున్నారు. ప్రారంభంలో సురక్షితంగా ఉందా లేదా అనేది పరిశీలించేందుకు ఈ రైలును ఆరునెలలపాటు ఓ డ్రైవరు నడుపుతారని, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రోరైలు నడుస్తుందని షిండే చెప్పారు.డ్రైవరు లేని మెట్రోరైళ్లు దహిసార్ నుంచి డిఎన్ నగర్ , దహిసార్ నుంచి అంధేరి ఈస్ట్ వరకు నడుపనున్నారు.ప్రతీ బోగిలో 52మంది చొప్పున మొత్తం 2,280 మంది ప్రయాణికులు ప్రయాణం చేయవచ్చు.రాబోయే ఆరునెలల్లో ఆరు డ్రైవరు లేని మెట్రోరైళ్లను నడపాలని నిర్ణయించామని మంత్రి షిండే వివరించారు.