హైదరాబాద్ నగరంలో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతిం


 హైదరాబాద్ నగరంలో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతించింది. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సరూర్ నగర్‌ స్టేడియం నుంచి ఉప్పల్‌ సర్కిల్‌ వరకు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీలో వామపక్ష నేతలు, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటారని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ రా
ష్ట్ర కన్వీనర్‌ పద్మ తెలిపారు.