ప్రారంభమైన ఏపీ పోలీస్ డ్యూటీ మీట్.

 


ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ డ్యూటీ మీట్‌ తిరుపతిలో ప్రారంభమైంది. ఆరేళ్ల తర్వాత పోలీస్‌ డ్యూటీ మీటింగ్‌ జరపడం ఇదే తొలిసారి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. దేవుడు విగ్రహాలను కూల్చడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ప్రజా విశ్వాసాలను దెబ్బతిసి తప్పుడు ప్రచారాలు ఎవరికి లాభం, ఇవ్వన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎవరినీ లక్ష్యంగా చేసుకోని ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు.