ఒకప్పుడు ఎవరికైనా విషెస్ చెప్పాలంటే ఫోన్లో టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా తెలిపేవారు. అయితే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, డేటా ధరలు బాగా తగ్గడంతో అందరూ ఇంటర్నెట్ ఆధారంగానే మెసేజ్‌లు పంపించుకుంటున్నారు. ఇక వైఫైలు అందుబాటులోకి వచ్చాక మరో అడుగు ముందుకేసి ఆడియో కాల్స్ కూడా యాప్‌ల ద్వారానే చేసేస్తున్నారు. ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు ఆడియో, వీడియో కాల్స్‌లకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది వైఫై ఆధారంగా కాల్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. న్యూ ఇయర్ రోజు ఏకంగా 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్‌తో సంచలనం సృష్టించింది. వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో కాల్స్ నమోదుకావడం తొలిసారని ఫేస్బుక్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ కాల్స్ సంఖ్య 50 శాతం పెరగడం విశేషం. కేవలం వాట్సాప్ కాకుండా.. ఫేస్బుక్ మెసెంజర్లో కూడా వీడియో, గ్రూప్ కాల్స్ సంఖ్య భారీగా పెరిగాయట. ఇక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సుమారు 5.5 కోట్ల మంది యూజర్లు న్యూ ఇయర్ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ చేశారని ఫేస్బుక్ తెలిపింది. ఇదిలా ఉంటే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఫేస్బుక్ కొను