టాలీవుడ్‌ అగ్రదర్శకుల్లో రాజమౌళి


 టాలీవుడ్‌ అగ్రదర్శకుల్లో రాజమౌళి ఒకరు. సినిమాల్లోని సన్నివేశాలను శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టే రాజమౌళిని అభిమానులు జక్కన్న అని పిలుచుకుంటారు. ఇక టాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఒకరు. మహేష్‌ సిని
మా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు యావత్‌ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తుంది. అలాంటి వీరిద్దరి కాంబినేషనల్‌లో ఓ సినిమా రానుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం రాజమౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజేయంద్రప్రసాద్‌ ఇప్పటికే కథను పూర్తి చేశాడని సమాచారం. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్‌ శివాజీ పాత్రలో నటిస్తాడని ఓ వార్త తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ..


ఈ వార్త విన్న మహేష్‌ అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో ఛత్రపతి శివాజీగా కనిపిస్తే ఎలా ఉంటాడో అని ఇప్పటి నుంచే ఊహించుకోవడం మొదలు పెట్టారు.