ఈ ఏడాదిలో తొలిసారి నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.

 


ఈ ఏడాదిలో తొలిసారి బుల్ రన్‌కు బ్రేక్ పడింది. వరుసగా లాభాలతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత 10 రోజులుగా లాభాలను మూటగట్టుకు మార్కెట్లు… ఈ రోజు మాత్రం నష్టాలతో ముగిశాయి. నిన్న మెటల్ మార్కెట్లు మెరిసినప్పటికీ.. అంత జోష్ కనిపించలేదు. ఈ ఉదయం మార్కెట్లకు కనిపించిన దూకుడు ముగింపులో కనిపించలేదు. ఈ రోజు ప్రధానంగా టెక్నాలజీ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌ కౌంటర్లు భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బజాజ్‌ ఫైనాన్స్‌ హెవీ వెయిట్‌ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. దీంతో పది రోజులుగా ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ ఉదయం (06-01-2021) 48,504 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గానే కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు 500 పాయింట్ల మేర నష్టాల్లోకి వెళ్లింది. చివరికి 263.72 పాయింట్ల నష్టంతో 48,174.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 66.70 పాయింట్ల నష్టంతో 14,146.25 వద్ద స్థిరపడింది. కొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులను ప్రభుత్వం ధృవీకరించిన తరువాత వెంకిస్ ఫాల్స్ 6 శాతం నష్టపోయింది.