రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.....

 


రైల్వే ప్రయాణీకులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సిలేషన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల ఉన్న ఆ గడువును.. తాజాగా 9 నెలల వరకు పొడిగించింది. కరోనా కారణంగా పలు రైళ్లు రద్దయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే 2020 మార్చి 21 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణానికి రైల్వే కౌంటర్ల వద్ద రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్న వారు.. తమ ప్రయాణ తేదీ నుంచి 9 నెలలోపు ఎప్పుడైనా కూడా రద్దు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ ఆరు నెలల సమయంలో రీఫండ్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారని.. అందరికీ కూడా పూర్తిస్థాయిలో రీఫండ్ అందజేస్తామని రైల్వేశాఖ వెల్లడించింది.