వనస్థలిపురంలో ఉన్న ఓ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

 

నగర శివార్లలోని వనస్థలిపురంలో ఉన్న ఓ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎస్‌ఎస్‌ఆ
ర్‌ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో అపార్ట్‌మెంట్‌ వాసులు బయటికి వచ్చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది. అయితే ఈ మంటల వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలిసింది.