ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 505 ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐఓసీఎల్. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి తాత్కాలికంగా భర్తీ చేస్తున్న అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://iocl.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. మొత్తం ఖాళీలు- 505

పశ్చిమ బెంగాల్ - 221

బీహార్- 76

ఒడిషా- 66

జార్ఖండ్- 41అస్సాం- 80

వీటితో పాటు ట్రేడ్ అకౌంటెంట్ పోస్టులు 21 ఉన్నాయి.